English   

జేడీ లక్ష్మీ నారాయణకు హీరో నిఖిల్ మద్దతు 

Nikhil
2019-04-10 15:31:42

ఈసారి ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో, ప్రచారాల్లో సినీ నటుల ప్రమేయం ఎక్కువైంది. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున సినీ నటులు ఎన్నికల ప్రచారం చేశారు. జీవిత, రాజశేఖర్, అలీ, పోసాని క్రిష్ణమురళి, పృథ్వీ, శ్యామల లాంటి వారు వైసీపీకి ప్రచారం కల్పించారు. మరోవైపు టీడీపీకి నారా రోహిత్, దివ్యవాణి, తారకరత్న, మురళీ మోహన్, సురేఖా వాణి, చివరిలో సమంత లాంటి వారు ప్రచారం చేశారు. ఇక జనసేన పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ టీమ్  ప్రచారం చేశారు. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నిహారికలు కూడా ప్రచారం నిర్వహించారు. తాజాగా జనసేనకు మద్దతిస్తోన్న సినీ నటుల జాబితాలో ఇప్పుడు హీరో నిఖిల్ కూడా చేరారు. నిన్న ఆయన జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కలిశారు. లక్ష్మీనారాయణ ప్రజలకు సమర్పించిన వాగ్దానాలతో కూడి బాండ్ పేపర్‌ను నిఖిల్ పరిశీలించారు. ఈ మేరకు లక్ష్మీనారాయణను కలిసిన విషయాన్ని ట్విట్టర్‌ లో షేర్ చేశారు. ‘ప్రతి ఆర్టిస్ట్ నా ఫ్యామిలీ అని గతంలో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాంటి ఫ్యామిలీ మెంబర్‌కి సపోర్ట్ చేస్తూ, తన పార్టీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ గారిని కలిసి పోల్ ప్రామిస్ అఫిడవిట్ గురించి మాట్లాడాను. శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ విధంగా రాజకీయనాయకుల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా చేయడం ఇదే తొలిసారి’ అని నిఖిల్ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. 

More Related Stories