English   

సైకిల్ కి వోటు వేయండి...సమంత సంచలనం !

Samantha
2019-04-10 15:47:49

ఏపీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే వోటు వేయండని సమంత చెబుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే ఇది రెండు రకాలుగా వైరల్ అవుతోంది. ఒకటి ఏమో రేపల్లి టీడీపీ అభ్యర్హ్డికి వోటు వేయమని సమంతా కోరినట్టు ఉండగా మరొకటి సైకిల్ గుర్తుకు వోటు వేయండని చెబుతున్నట్టు ఉంది. అయితే ఈ విషయం పరిశీలిస్తే ఆమె రేపల్లె టీడీపీ అభ్యర్ధికి మద్దతు పలికినట్టు తెలుస్తోంది.   ఒకవైపు మామ అక్కినేని నాగార్జున.. పరోక్షంగా జగన్‌ని సపోర్ట్ చేస్తుంటే కోడలు సమంత ఇలా తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ కావడం ఏంటి?.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. ‘నేను మీ సమంత.. మన రేపల్లె మన అనగాని గారు.. అభివృద్ధికి ఓటేయండి.. అనగాని సత్య ప్రసాద్‌ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు’ అంటూ సమంత రేపల్లె టీడీపీ అభ్యర్ధి సత్యప్రసాద్‌ని గెలిపించమని కోరుతూ విడుదల చేసిన వీడియో పలు రకాల చర్చలకు తావిస్తోంది. దీంతో ఆమెనే అడిగేశాడు ఒక అభిమాని ఆయన మీకు ఏమవుతాడు అని. దీంతో స్పందించిన సమంతా ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని వ్యక్తిగతంగా నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నానని  ఆయన సోదరి డాక్టర్ మంజుల నాకు బాగా తెలుసు. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుండి ఆమెతో నాకు పరిచయం ఉంది అని అందుకే మద్దతు ఇస్తున్నా’ అని చెప్పుకొచ్చింది సమంత అక్కినేని.

More Related Stories