English   

కీర్తి చిరుతో సినిమా ఒప్పుకున్నట్టేనా ?

Chiranjeevi
2019-04-10 16:04:46

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత చరణ్. సైరా సినిమాలో అనేక రీ షూట్స్ చేయడం వలన ఇంకా పూర్తి కాలేదు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కొత్త సినిమా మొదలు కానుంది. అయితే ఈ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకి ముందుగా నయనతారను లేడీ లీడ్ గా అనుకున్నారు, అయితే సైరాలో కూడా ఆమె హీరోయిన్ కావడంతో ఆమెను మార్చాలని భావించిన యూనిట్ చిరంజీవి సరసన కీర్తి సురేష్‌ను ఓకే చేశారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే కీర్తి సురేష్‌ కి కొరటాల శివ కధ చెప్పారని, ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. తెలుగులో కీర్తి సురేష్ ఆఖరి సినిమా ‘మహానటి’. ఆ తరవాత మరే తెలుగు సినిమాను అంగీకరించలేదు. మరి ఇప్పుడు చిరంజీవి సినిమాలో అవకాశాన్ని కీర్తి వదులుకోదనే భావిస్తున్నారు. 
 

More Related Stories