English   

ప్రియా వారియర్ సొంత గొయ్యి తవ్వుకుందా.. ఏంటి పరిస్థితి..? 

 PriyaPrakashVarrier
2019-04-10 16:51:09

అదృష్టం వచ్చినప్పుడు తలుపు తీయాలి.. అది అస్తమానం తలుపు తట్టదు. కానీ దురదృష్టం మాత్రం ఎప్పుడూ వెంటే ఉంటుంది. ప్రియా వారియర్ విషయంలో రెండు జరిగాయి. అదృష్టం వచ్చి తలుపు తీసినప్పుడు ముసుగుదన్ని మాస్టర్ బెడ్ రూమ్ లో పడుకుంది ప్రియా వారియర్. ఇప్పుడు దురదృష్టం వరుసగా వచ్చి తలుపు తడుతుంది. తలుపు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. లవర్స్ డే సినిమాకు ముందు చాలా అవకాశాలు ఈ భామకు వచ్చాయి. కానీ తొలి సినిమా విడుదలైన తర్వాత అన్నింటికీ సంతకం పెడతారని కాస్త హెచ్చులకు పోయింది ప్రియా వారియర్. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత అమ్మడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఏదో కన్నుకొట్టి అందరినీ పడేసింది కానీ సినిమాలో మాత్రం ప్రియ వారియర్ క్యారెక్టర్ కు అంత సినిమా లేదు. అసలు ఈమె మెయిన్ హీరోయిన్ కాదు. కేవలం ప్రియా వారియర్ కు అనుకోకుండా వచ్చిన ఇమేజ్ ను వాడుకోవడానికి దర్శక నిర్మాతలు ఆమె హీరోయిన్ అనేలా ప్రమోట్ చేశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రియా వారియర్ హీరోయిన్ కాదని తెలుసుకొని ప్రేక్షకులు నిరాశ పడ్డారు. దానికి తోడు సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఈమె కెరీర్ ఎలా మారుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అల్లు అర్జున్, రణ్ వీర్ సింగ్ లాంటి హీరోలకు కూడా నో చెప్పింది ప్రియా వారియర్. మళ్లీ వాళ్ల సరసన హీరోయిన్ గా నటించాలంటే ప్రియా వారియర్ ఇంకో జన్మ ఎత్తాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ప్రస్తుతం అయితే సినిమాలు లేకుండా ఖాళీగానే ఉంది ఈ ముద్దుగుమ్మ.

More Related Stories