English   

మోదీ బయోపిక్ రేపు రానట్టే !

 ModiBiopic
2019-04-10 17:13:03

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయోపిక్‌ ఎన్నికల రోజే విడుదల చేయాలని భావించిన ఆ సినిమా మేకర్స్ కి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇది ప్రజలను ప్రభావితం చేసేలా ఉన్నందున ఈ సినిమాను ఎన్నికల లోపు రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా నిలిచిపోనుంది. మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు కూడా ఇటీవల క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే సినిమా బీజేపీకి లాభం చేకూర్చేలా ఉందని ఆరోపిస్తూ విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంతో ఈసీ ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేసి అభిప్రాయం చెప్పాలని సూచించింది. దీని ప్రివ్యూ చూసిన ప్యానెల్ విడుదల ఆపాలంటూ ఈసీకి సిఫార్స్ చేసింది. దీంతో మోదీ బయోపిక్‌ను ఇప్పుడు విడుదల చేయొద్దని, ఎన్నికల తర్వాత రిలీజ్ చేసుకోవాలని నిర్మాతలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. 
 

More Related Stories