English   

రజనీ దర్బార్ మొదలయ్యింది !

Darbar
2019-04-10 17:40:32

సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో దర్బార్ అనే సినిమాని నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించి నిన్న ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే ఈరోజు ఈ సినిమాను  ముంబైలో లాంఛనంగా ప్రారంభించారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో రజినీకాంత్, మురుగదాస్, నిర్మాత అల్లిరాజా, మిగతా యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం రజినీకాంత్, శుభస్కరన్ కలిసి స్క్రిప్టును మురుగదాస్‌కు అందజేశారు. ఈ సినిమాలో ఫైట్స్‌ను టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్అయిన రామ్ లక్ష్మణ్‌లు కంపోజ్ చేస్తున్నారని సమాచారం. అందుకే వీరిద్దరు కూడా చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమాని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అల్లిరాజాతో కలిసి నిర్మిస్తోంది. రజనీ కూతురికి స్నేహితుడయిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికీ పనిచేస్తున్నారు. రజినీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

More Related Stories