English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకి సిద్దం !

lakshmisntr
2019-04-10 18:11:24

ఎన్నికల ముందు అనేక వివాదాలకు కారణమయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కి సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే తెలంగాణాలో రిలీజ్ అయి మంచి టాక్ కూడా తెచ్చుకుంది. అయితే ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందన్న కారణంతో ఈ సినిమా మీద టీడీపీ నేతలు కేసులు వేయడంతో కోర్టు ఈ సినిమా విడుదల మీద స్టే విధించింది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ దాటాక అంటే ఈ శుక్రవారం ఈ సినిమా ఆంధ్రాలో రిలీజ్ కానుంది. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేసారు. ఈ వారమే సినిమా రిలీజ్ కానుందని ఆయన ప్రకటన సారంశం. అయితే ఈ సినిమా ఏప్రియల్ 12న సినిమా రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. అసలు ఈ సినిమా మీద స్టే విదించడానికి కారణం ఎన్నికలు. ఈ ఎన్నికలు పూర్తయితే ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా ఎల్లుండి ఏపీలో విడుదల అవుతుందని అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ అవుతుందో లేదో ?

More Related Stories