English   

ఆది బుర్రకధ మోషన్ పోస్టర్ రిలీజ్ !

BurraKatha
2019-04-10 18:21:06

ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది హీరోగా రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా బుర్రకథ. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో ఆదిని డ్యూయల్ షేడ్ లో చూపించారు. స్పోర్ట్స్, సినిమా స్టార్స్, హ్యబిట్స్ కి సంబంధించి పలు టైటిల్స్ ని మోషన్ పోస్టర్లో హైలైట్ చేశారు. మొత్తానికి కాస్త తక్కువ క్వాలిటీతో ఉన్నట్టు అనిపించినా కాస్త ఇంటరెస్టింగ్ గానే ఉంది. దీంతో ఈ సినిమా మీద అంచనాలు బాగానే నెలకొంటున్నాయి. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్‌  సరసన మిష్టి చక్రవర్తి ,నైరా షా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్, గాయత్రీ గుప్తా తదితరులు కూడా నటిస్తున్నారు. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరో విచిత్రమయిన విషయం ఏంటంటే ఈ సినిమా ద్వారా కిరణ్, ప్రసాద్ కామినేని, సురేష్, దివ్య భావన బండ్ల, సయీద్ తాజుద్దీన్ లు ఓకే సారి స్క్రీన్‌ ప్లే రచయితలుగా పరిచయమవుతున్నారు. 

More Related Stories