English   

చిత్రలహరి బిజినెస్ అదిరిపోతుంది బాసూ.. సాయి తేజ్ కేక.. 

Chitralahari
2019-04-10 19:05:07

సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం చిత్రాలహరి. ఈ సినిమా ఎప్రిల్ 12న విడుదల అవుతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక బిజినెస్ పరంగా కూడా ఈ చిత్రం మంచి హైప్ ఉండటంతో దర్శక నిర్మాతలు కూడా విజయంపై నమ్మకంగా కనిపిస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో మళ్లీ విజయం అందుకుంటానని సాయి కూడా ధీమాగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం తప్ప ఇప్పుడు మరో సినిమా కూడా ఒప్పుకోలేదు సాయి ధరమ్ తేజ్. మెగా మేనల్లుడి సినిమాకు తొలిసారి స్వరాలు అందిస్తున్నారు దేవి శ్రీ ప్రసాద్. ఇప్పటి వరకు మెగా కుటుంబంలో అందరి హీరోలతో పనిచేసిన దేవి.. సాయి ధరమ్ తేజ్ తో మాత్రం ఇన్ని రోజులు పని చేయలేక పోయాడు. ఇన్నాళ్లకు కిషోర్ తిరుమల ఈ కాంబినేషన్ కలిపాడు. ఇందులో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయి. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ కు ఏది కలిసిరాదు. జీవితంలో బాగా వెనుకబడి పోయిన క్యారెక్టర్ ఇది. ప్రస్తుతం ఈయన ఒరిజినల్ కెరీర్ కూడా అలాగే ఉంది. ఎంత వేగం పెంచిన లోకం తనను వెనక్కు వేసి వెళ్లిపోతుంది అంటూ ఈ పాటలో రాసాడు దేవి శ్రీ. దీన్నిబట్టి హీరో క్యారెక్టర్ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సాయి గత ఫ్లాపులతో పని లేకుండా 18 కోట్ల వరకు బిజినెస్ చేసింది చిత్రలహరి. ఈ సినిమాతో కచ్చితంగా విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు మెగా మేనల్లుడు. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రలహరి. సునీల్ ఈ చిత్రంలో పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ రోల్ పోషిస్తున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు తనకు సరిపోయే పాత్ర రాలేదు. అయితే చిత్రలహరిలో మాత్రం కచ్చితంగా కడుపులు చెక్కలు చేసే క్యారెక్టర్ ఇది అంటున్నాడు సునీల్. మొత్తానికి ఈ సినిమాతో అటు సాయి ధరంతేజ్ కెరీర్ గాడిన పడుతుందో లేదో చూడాలి.

More Related Stories