English   

నాగ చైతన్యను వెనక్కు నెట్టిన అఖిల్ ?

Akhil
2019-04-11 12:53:37

ఆఫీసర్ సినిమా ఫ్లాప్ కావడంతో అప్పటి నుండి సైలంట్ అయిన కింగ్ నాగార్జున. ఈమధ్యనే సూపర్ హిట్ సినిమా మన్మధుడు సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసి సినిమా షూట్ కూడా మొదలు పెట్టేశారు. ఈ నేపధ్యంలో ఆయన మరో సినిమాకి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా'కి సీక్వెల్ గా 'బంగార్రాజు' చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బంగార్రాజు మనవడి పాత్రలో తొలుత నాగచైతన్య నటించనున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే, ఈ పాత్రను నాగచైతన్య కన్నా అఖిల్ ని పెట్టి తీస్తే  బాగుంటుందని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన మార్పుతో నాగ్ ఏకీభవించినట్టు తెలుస్తోంది. బంగార్రాజుకు, అతని మనవడికి మధ్య జరిగే కథతో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ కు తుది రూపును ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు.  

More Related Stories