English   

బిజీ బిజీగా మహేష్-త్రివిక్రమ్ లు !

 Trivikram
2019-04-11 15:20:59

ప్రస్తుతం మహర్షి ప్యాచ్ వర్క్ తో ఉన్న మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న త్రివిక్రమ్ ఒక షూట్ లో బిజీ అయ్యారు. అదేంటి ఒక మాటా లేకుండానే ఇద్దరూ షూట్ లో పాల్గొనడం ఏమిటి అనుకుంటున్నారా ? అదేమ లేదు లెండి ఈ ఇద్దరూ పాల్గొన్నది ఒక యాడ్ షూట్ లో. ప్రస్తుతం వీరిద్ద్దరి కాంబినేషన్ లో ఒక యాడ్ ఫిలిం షూట్ జరుగుతోంది. దానికి సంబందించిన ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన మహేష్ తన అభిమాన డైరెక్టర్ తో ఉన్నానని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరో సినిమా గనుక ఇద్దరూ ఒక మాట అనేసుకుంటే అది మూడో సినిమా అవుతుంది.  

More Related Stories