English   

క్యాన్సర్ కంటే ట్రీట్మెంట్ చాల భయంకరమైనదంటున్న సోనాలీ !

SonaliBendre
2019-04-11 16:04:30

క్యాన్సర్ తనలోని భయాన్ని పోగొట్టడంతో పాటు సాహసాలు చేయడానికి స్ఫూర్తిని అందించిందని బాలీవుడ్ నటి సోనాలీబింద్రే అన్నారు. నిన్న ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనాలిబింద్రే పాల్గొని స్విచ్ ఆన్ ది సన్‌షైన్ అనే అంశం మీద మాట్లాడారు. క్యాన్సర్ వచ్చినప్పుడు తన అనుభవాలను, చికిత్స సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కుటుంబసభ్యుల మద్దతు తదితర అంశాలపై వివరించారు. అసలు నాకు ఇలా అవుతుంది అని అనుకోలేదని ఆమె అన్నారు. ఇధి అంత ఒక కల అయి ఉంటే బాగుండు అనుకున్నానని ఆమె అన్నారు. అడ్వాన్స్ దశలో క్యాన్సర్ తనను కబలించబోతున్నదని తెలియగానే షాక్‌కు గురయ్యానన్నారు. తన భర్త ఇచ్చిన ధైర్యంతో నెమ్మదిగా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని కీమో థెరపీకి సిద్ధమయ్యానని, తన పన్నెండేండ్ల కొడుకుకు తన ఆరోగ్య పరిస్థితిని వేరేవాళ్లు చెప్పేకన్నా తానే చెప్పాలని నిర్ణయించుని తనతో పాటు డాక్టర్ల వద్దకు తీసుకుని వెళ్లి అన్ని విషయాలను వివరించానని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా లో నా క్యాన్సర్ గురించి షేర్ చేసుకోవడం వల్ల.... ఫ్యాన్స్ నుండి చాలా ప్రేమని పొందానని ఆమె అన్నారు. క్యాన్సర్ అనేది ఎవరికీ అయినా వస్తుంది.....కాబట్టి రెగ్యులర్ గా చెక్ ఆప్స్ చేయించుకోవాలని అన్నారు. యోగ, మెడిటేషన్ చేయడం వల్ల బలహీనతల నుండి బయటపడవచ్ని అన్నారు. క్యాన్సర్ కంటే ట్రీట్మెంట్ చాల భయంకరమైనదని కానీ క్యాన్సర్‌ను ప్రారంభదశలో గుర్తిస్తే ఎన్నో రకాలైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆమె అన్నారు. 

More Related Stories