English   

నేతల బయోపిక్స్ మీద ఈసీ కొరడా !

 EC
2019-04-11 16:44:46

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పీఎం నరేంద్రమోదీ బయోపిక్‌ విడుదలను ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోని రాజకీయ నేతల బయోపిక్ ల విడుదల మీద కూడా ఈసీ ఆంక్షలు విధించింది. బయోపిక్ సినిమాల ప్రదర్శన, వాణిజ్య ప్రకటనలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. పత్రికలు, టీవీల్లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఉండకూడదని, సినిమా థియేటర్లలో షోలు వేయకూడదని ఈసీ ఆదేశాలు జారీచేసింది. బయోపిక్ సినిమాల వాల్ పోస్టర్ల మీద సైతం ఈసీ నిషేధం విధించింది. బయోపిక్ లపై ఈసీ ఆదేశాల అమలుకు ఒక ప్రత్యేక పర్యవేక్షక కమిటీ ఏర్పాటైంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో పర్యవేక్షక కమిటీ ఉల్లంఘనలను పరిశీలిస్తుందని, ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఈసీ స్పష్టం చేసింది. మన తెలుగులో రిలీజ్ అయిన కేసీఆర్ ఉద్యమ సింహం, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల నిర్మాతలకు కూడా ఈ విషయంలో ఈసీ నుండి నోటీసులు అందాయి. వారు ఆ నోతీసులకి లిఖిత పూర్వ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

More Related Stories