English   

రాజ శేఖర్ కల్కి కధ అదేనా ?

kalki
2019-04-11 18:47:26

చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకున్న హీరో రాజశేఖర్ గత ఏడాది గరుడవేగ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తరువాత కూడా అయన అంతే రేంజ్ లో ఉన్న సినిమా చేయడం కోసం చాలా గ్యాప్ తేసుకున్నారు. ఎట్టకేలకు ఆయన ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ ను నిన్ననే విడుదల చేశారు. టీజర్ కాస్త ఇంటరెస్టింగ్ గా అనిపించడంతో ఈ సినిమా కధ మీద ఆసక్తి పెరిగింది. ఈ నేపధ్యంలో ఈ సినిమ కధ ఎలా ఉంటుందో ప్రశాంత్ వర్మను అడిగితే 1980ల నేపథ్యంలో సాగే పరిశోధనాత్మక థ్రిల్లర్‌ అని ఆయన చెప్పుకు వచ్చారు. ఇందులో రాజశేఖర్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నారని చెప్పుకువచ్చారు. అంతకు మించి ఏమీ చెప్పలేమని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం 1985లో కృష్ణా జిల్లాలో మూడు సంపన్న కుటుంబాలను చంపేందుకు ప్రత్యర్థులు ఓ మంచి నీటి సరస్సుని విషంతో నింపేస్తారు. అదే సమయంలో పొరుగునే ఉన్న గుంటూరు జిల్లాలో కూడా అంతు చిక్కని రీతిలో కొన్ని హత్యలు జరుగుతాయి. ఈ రెండు సంఘటనలు లింక్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్కిని రాసుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనలపై విచారణ జరపడం కోసం నియమించబడిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ కనిపిస్తారని అంటున్నారు.  

More Related Stories