English   

చిత్రలహరి మూవీ రివ్యూ !

 Chitralahari Review
2019-04-12 14:07:07

చిత్రలహరి...ఒకప్పుడు దూరదర్శన్ లో వచ్చే పాటల ప్రోగ్రాం అందరికీ గుర్తుండే ఉంటుంది. 90లలో యూత్ అంతా తెగ ఫాలో అయ్యేవారు. అదే పేరుని తన సినిమాకి పెట్టుకుని వచ్చాడు మెగా హీరో ధరమ్ తేజ్. మెగా హీరో ట్యాగ్‌తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకూ రికార్డులు బద్దలు కొట్టే హిట్ ఇవ్వలేకపోయాడు. ఈ సినిమా మీద అనేక ఆశలతో ఉన్నాడు తేజ్. అందుకోసం పేరు కూడా మార్చుకుని శాయి తేజ్ అయ్యాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కధ :

ఇంజినీరింగ్ చదివిన విజయ్‌ కృష్ణ (సాయి తేజ్‌ అదేనండీ ధరమ్ తేజ్) జీవితంలో సక్సెస్‌ అంటేనే తెలియ కుండ పెరుగుతాడు. ఈ పోటి ప్రపంచంలో తాను చేయాలని అనుకున్నది ఇంకెవరో చేసేసి ఉంటారు. అలా అని విజయ్ భాద పడకుండా అతని తండ్రి (పోసాని కృష్ణమురళి) మాత్రం తన కొడుకు ఎప్పటికైన సక్సెస్‌ అవుతాడన్న నమ్మకంతో ఉంటాడు. యాక్సిడెంట్‌లో సరైన సమయానికి సహాయం అందక చనిపోతున్న వారిని కాపాడేందుకు విజయ్‌ ఓ డివైజ్‌ను తయారు చేస్తాడు. దానిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే లహరి(కల్యాణీ ప్రియదర్శన్‌) ప్రేమలో పడతాడు. ఆమెతో ఆడిన చిన్న అబద్దం వలన పెళ్లి దాకా ఊహించుకున్న వారి ప్రేమ సామ్రాజ్యం కూలిపోతుంది. అలా కూలిన ప్రేమ సౌధాన్ని ఎలా నిర్మించుకున్నాడు. అలాగే ఈ సినిమాలో స్వేచ్ఛ (నివేదా పేతురాజ్‌) ఏమి చేస్తుంది అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :

మనసుకు హత్తుకునేలా సినిమాలు తీసే కిషోర్ నేటి రోజున యూత్ బాధ పడే విషయం మీదే ఫోకస్ చేశాడు. సక్సెస్‌ వెంట పరిగెడుతూ తమని తాము ఎలా కోల్పోతున్నారు, ఈ క్రమంలో ప్రేమకి సక్సెస్ కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే అంశం హైలైట్ చేస్తూ ఈ కధ రాసుకున్నాడు. కానీ లైన్ బాగుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం దెబ్బెసింది. సినిమా మొదలు నుండి కథా కథనాలు సాగతీతగా అనిపిస్తయి. అయితే డైలాగ్స్ మాత్రం పేలేలా రాసుకున్నాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే నేటి తరం కుర్రాడిగా తనవంతుగా బాగానే నటించాడు. మెచ్యుర్డ్‌ పర్ఫామెన్స్‌తో విజయ్‌ కృష్ణ పాత్రలో జీవించాడు. అయితే ఆ గెడ్డం లుక్ అంతా నప్పలేదు, చాలా సార్లు కొన్ని యాంగిల్స్ లో వరుణ్ తేజ్ ని జ్ఞప్తికి తెచ్చి ఐడేంటీ కోసం ఇబ్బంది పడినట్టు అనిపించింది. హీరోయిన్‌ గా కల్యాణీ ప్రియదర్శన్‌ పరవాలేదనిపించింది. ఆమెకు డబ్బింగ్ ఎవరో పెద్ద వయసు ఆవిడతో చెప్పించినట్టున్నారు. మరో హీరోయిన్‌గా నటించిన నివేదా పేతురాజ్‌ యాంగ్రీ విజయశాంతి టైప్ క్యారెక్టర్ లో జీవించింది. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, సునీల్‌, వెన్నల కిశోర్‌, రావు రమేష్ తదితరులు పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా ఈ సినిమాతో పరవాలేదనిపించాడు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి సినిమాకి రిచ్ నెస్ తెచ్చింది. ఇక ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ : సాయి ధరమ్ తేజ్...సాయి తేజ్ అయినా పెద్దగా లక్కు మారలేదు.

రేటింగ్: 2.75/5.

More Related Stories