English   

రజనీ కోసం నాగ్ సినిమా వదులుకుందా ?

 Nayanthara
2019-04-12 15:46:41

నాగార్జున ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు సీక్వెల్ అయిన మన్మధుడు 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ మద్యనే హైదరాబాద్ లో మొదలయ్యింది. ఈ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక పోర్చుగల్ లో షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా పూర్తయ్యాక నాగ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేయనున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు కళ్యాణ్. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరిలో గానీ వచ్చే నెల ఆరంభంలో కానీఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నయనతారను సంప్రదించారట. అయితే డేట్స్ లేని కారణంగా ఈ సినిమా చేయలేనని ఆమె చెప్పినట్టుగా సమాచారం. నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన సైరా చేస్తోంది. అలాగే తమిళంలోను ఒక సినిమా చేస్తోంది. ఇక తాజాగా రజనీ సరసన దర్బార్ లో కూడా ఆమె ఎంపిక అయింది. దర్బార్ షూట్ రోజుల్లోనే బంగార్రాజు సినిమా ప్లాన్ చేసిన నేపధ్యంలో రజనీ కోసం నాగ్ సినిమాని ఆమె దూరం చేసుకుందని అంటున్నారు.

More Related Stories