English   

కోహ్లీ కోసం సినిమాలు మానేస్తుందా ?

 AnushkaSharma
2019-04-12 16:11:21

బాలీవుడ్ నటి అనుష్క శర్మ టీమ్ ఇండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని రెండేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళికి ముందు చాలా మ్యాచ్ లలో ఎన్నో పరాజయాలు పొందిన కోహ్లీ వివాహం అయ్యాక మాత్రం తనదైన పెర్ఫార్మెన్స్ చూపించాడు. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం అనుష్క పూర్తిగా సినిమాలు చేయడం మానేసి భర్తకు తోడుగా ఉండాలని భావోస్తోందట. ఆమె గతేడాది రిలీజ్ అయిన జీరో సినిమా తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు. రానున్న ప్రపంచ కప్ సిరీస్ కి కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అందుకే ఆమె కోహ్లీకి దన్నుగా నిలబడాలని భావిస్తోందట. అందుకే కనీసం ప్రపంచ కప్ పూర్తి అయ్యే వరకు ఏ సినిమాలో నటించవద్దనే నిర్ణయానికి వచ్చిందని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకూ నిజమో తెలీదు కానీ విరాట్, అనుష్క పెళ్లికి ముందు అనుష్క క్రికెట్ స్టేడియంలో సందడి చేసిన సందర్భాలు అనేకం. అయితే కోహ్లి ఆటలో విఫలమైన సందర్బాల్లో ఆమె అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. నీ మోజులో పడి కోహ్లి సరిగా ఆడటం లేదంటూ అప్పట్లో ఆమెపై కొందరు నిందలు కూడా మోపారు. ఇలాంటి నేపధ్యం ఉన్న క్రమంలో ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు కొందరు అభిమానులు. అయితే ఆమె సినిమా నటన నుండి తప్పుకున్నా సినిమా నిర్మాణం మీద ద్రుష్టి పెడుతుందని అంటున్నారు.  

More Related Stories