English   

ఏంటి ప్రియా....ఇలా అయితే అలా ?

Priya Prakash
2019-04-12 16:53:34

ఓకే ఒక కన్నుగీటుతో నేషనల్ స్టార్ గా ఎదిగిపోయింది మళయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. నిండా ఇరవై ఏళ్ళు కూడా లేని ఈ భామ మొదటి సినిమా నిరాశ పరిచినా కన్నుగీటుతో వచ్చిన క్రేజ్ ని ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్ లాంటి వాటి ద్వారా డిజిటల్ ప్రమోషన్స్ చేస్తూ సంపాదిస్తోంది. తాజాగా అలా చేసి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఇటీవల ప్రియా ఓ పర్‌ఫ్యూమ్ ప్రమోషనల్ యాడ్ లో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆ బ్రాండ్‌ ని ప్రమోట్ చేస్తూ మరో ఇద్దరు మోడల్స్ తో దిగిన ఫోటోలను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తర్వాత ఆ పోస్ట్ కు  క్యాప్షన్ కూడా పెట్టింది. అక్కడే ఆమె చేసిన తింగరి పనిని నెటిజన్లు గుర్తు పట్టేశారు. నిజానికి ఆమె పెట్టిన పిక్ కి ఏమని క్యాప్ష న్  ఇవ్వాలో కూడా ఆ బ్రాండ్ వాళ్లు ఆమెకు కంటెంట్ ఇచ్చారు. ఆ కంటెంట్ ముందు టెక్స్ కంటెంట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ అని రాసి ఉంది. అంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు ఈ కంటెంట్ పెట్టాలని అర్థం. అయితే ప్రియా మాత్రం సూచనలు ఇచ్చిన ఆ కంటెంట్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రియా చేసిన తప్పును కనిపెట్టిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కాపీ పేస్ట్ చేయడం కూడా సరిగ్గా రాదని పేర్కొంటూ ఆమె మీద కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో నెటిజన్ల కామెంట్లను చూసిన అమ్మడు చేసిన తప్పు తెలుసుకుని తన పోస్ట్ ను సరిచేసుకుంది.

More Related Stories