English   

లేటు వయసులో ఎంత ఘాటు ప్రేమయో ?

Shibani Dandekar insecure about her relationship with Farhan Akhtar
2019-04-13 08:04:41

ఎంత వారు గానీ వేదంతులయినా గానీ వాలు చూపు సోకగానే వాలిపోదురే అని ఒక సినీ రచయిత అన్నాడు. ఆ మాట అక్షారాలా నిజం అనిపిస్తున్నాడు దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఫర్హాన్ అక్తర్. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ప్రేమలో పడ్డాడు. నిజానికి ప్రేమకు వయసుతో పనిలేదు కానీ సమాజంతోనే పని అది కూడా పెళ్ళయ్యి ఎదుగుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఫర్హాన్ విషయంలో మాత్రం తప్పే. ఎందుకంటే ఈ పెద్దమనిషి తన కో సింగర్ షిబాని దండేకర్ తో ప్రేమలో పడ్డాడు. ఎన్నాళ్ళ నుండి ఈ ప్రేమ వ్యవహారం నడుస్తుందో ఏమో కానీ  ఇటీవలే ఈ జంట మెక్సికోకు వెళ్ళింది. అక్కడ బీచ్ ఒడ్డున రెండు గుడ్డ పీలికలు అదే నండీ టూ పీస్ బికినీ వేసుకుని వీరు చేసిన రచ్చ మీడియా వాళ్ళు ఎవరో క్లిక్ మనిపించారు. దీంతో ఇంట్లో పెళ్లీడుకి వస్తున్న ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని ఇదేమి పోయేకాలం అంటూ కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

More Related Stories