English   

కధ ఇచ్చి నిర్మాతగా మారిన రెహమాన్ !

AR Rahman
2019-04-13 11:03:40

సంగీత దర్శకుడిగా ఇండియన్ సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన ఏఆర్ రెహ్మాన్ తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తన టేస్ట్ లో సంగీతం నేపథ్యంతో కూడిన సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి '99 సాంగ్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు రెహమాన్. ఒక స్ట్రగులింగ్ సింగర్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది. సొంతంగా నిర్మించడమే గాక ఈ సినిమా కథను కూడా ఆయనే రాయడం మరో విశేషం. విశ్వేశ్ కృష్ణమూర్తి అనే డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ ఏడాది జూన్ 21వ తేదీన తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ పోస్ట్ చేశారు రెహమాన్.  ఎహాన్ భాట్, ఎడిల్సి వెరగాస్, మనీషా కొయిరాలా, లీసారే, థామస్ ఆండ్ర్యూస్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

More Related Stories