English   

షూట్ లో రోజుకు ఎనిమిది గంటలు మేకప్ కోసమేనట !

 Deepika Padukone
2019-04-13 11:33:42

యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమా చపాక్. మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అంటే యాసిడ్ దాడికి గురయిన లక్ష్మీ పాత్రలో బాలీవుడ్‌ అందాల తార దీపికా పదుకొణె నటిస్తోంది. యాసిడ్‌ దాడికి గురయిన బాధితురాలిగా దీపిక ఎలా ఉంటుందో ఆమే గెటప్‌ ని ప్రేక్షకుల కోసం ఇప్పటికే రిలీజ్ చేశారు. అయితే లక్ష్మీ కధ దీపిక మనసుని ప్రభావిత చేయడం వలన హీరోయిన్ గ నటిస్తూనే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తనే తీసుకుంది. అంతే కాదు ఈ సినిమా కోసం ఆమె చాలా కష్ట  పడుతోంది. అయితే మామూలుగా ఉండే దీపిక యాసిడ్ దాడి బాదితురాలిగా కనిపించేందుకు ఆ పాత్ర మేకప్‌ కోసం రోజుకు సుమారు ఎనిమిది గంటలు సమయం కేటాయించవలసి వస్తోందని సమాకాహ్రం. యాసిడ్‌ దాడి బాధితురాలి గెటప్‌ లోకి వెళ్ళడానికి మూడు నుంచి నాలుగు గంటలు పడితే ఆ మేకప్‌ తీయడానికి అంతకన్నా  ఎక్కువ సమయం పడుతోందట. ప్రతి రోజూ మేకప్‌ వేయించుకుంటూ గంటల పాటు కదలకుండా కూర్చోవడం కష్టమైనా ఈ సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకం గౌరవంతో దీపిక ఎంతో కష్టపడుతోందట.

More Related Stories