English   

దిమాక్ ఖరాబ్ చేస్తున్న నభా నటేష్ !

Nabha Natesh
2019-04-13 11:44:20

హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మొదటి సారి రూపొందుతోన్న సినిమా `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్` అనే ట్యాగ్ లైన్ తో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ మీద పూరి జగన్నాథ్, ఛార్మిలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌ లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జరుపుకుతోంది.  ఈ సాంగ్‌లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్ ఇద్ద‌రూ రామ్‌ తో నర్తిస్తున్నారు. దిమాక్ ఖ‌రాబ్ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాటకు సంబంధించి ఈ మధ్యనే రిలీజ్ చేసిన నిధి అగ‌ర్వాల్ లుక్‌ అరుపులు పుట్టించింది. ఇక లెటెస్ట్‌గా ఇదే సాంగ్ లో నర్తిస్తున్న న‌భా న‌టేశ్ ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌ లో ఆక‌ట్టుకుంతోంది. మీరి కూడా ఒక లుక్ వేయండి మరి. తెలుగులో అదుగో, నన్ను దోచుకొందువటే సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరయిన ఈ భామ మూడో తెలుగు సినిమాకే అందాల ఆరబోత మొదలెట్టేసింది. అయినా పూరీ చేతిలో పడితే అయినా ఈ పాప ఫేట్ మారుతుందో లేదో చూడాలి మరి.

More Related Stories