English   

మురగదాస్ ని ఆడుకుంటున్నారుగా !

Murugadoss
2019-04-13 12:49:51

ఒకప్పుడు అంటే ఏమో కానీ ఇప్పుడు ఏ పని చేయలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాల్సి వస్తోంది. సామాన్యుల పరిస్థితే ఇలా ఉంటె ఇక సేలేబ్రిటీలు ఎలా ఉండాలి ? అత్యంత జాగరూకతతో ఉండాలి. ఏమాత్రం తేడా చేసినా చిలువలు వలువలు చేసి సోషల్ మీడియాలో దోషిగా నిలబెట్టేస్తున్నారు. తాజాగా రజనీ కాంత్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ హాలీవుడ్‌లో 2017లో వచ్చిన కిల్లింగ్ గంథర్ సినిమా పోస్టర్ నుంచి తీసుకున్నారని తేల్చేశారు నెటిజన్లు. ఆర్నాల్డ్ ష్వాట్జ్నెగ్గర్ ప్ర‌ధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా పోస్టర్ ను మురగదాస్ కాపీ కొట్టాడని అంటున్నారు. మురుగ‌దాస్ క్యాపీ క్యాట్‌గా మారాడ‌ని, పోస్టర్ల‌తో పాటు స్టోరీని కూడా ఆయ‌న కాపీ కొడుతున్నాడ‌ని నెటిజ‌న్స్ ఒక రేంజ్ లో ఏసుకుంటున్నారు. నిజానికి మురుగ‌దాస్ తెర‌కెక్కించిన గ‌త చిత్రాలు తుపాకి, కత్తి సినిమాల విషయంలో నెటిజ‌న్స్ ఈ రెండు హాలీవుడ్‌కి కాపీ అని అప్ప‌ట్లో స‌ర్టిఫికెట్ ఇచ్చారు.  

More Related Stories