English   

ఫ్యాన్స్ టెన్షన్ తీర్చిన బన్నీ !

 Allu Arjun
2019-04-13 17:24:47

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాకి ఎట్టకేలకి కొబ్బరి కాయ కొట్టారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్‌, బన్నీ కాంబో మూవీ లాంచ్ కార్యక్రమం ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నిర్మాత రాధాక్రిష్ణ, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తొలి షాట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్లాప్ కొట్టగా అల్లు అరవింద్ కెమెరా ఆన్ చేశారు. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. నా పేరు సూర్య సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్‌తో సినిమా గత ఏడాది ప్రకటించగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉండడంతో  ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక వచ్చే 24వ తేదీ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. నా పేరు సూర్య సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ సినిమా అనౌన్స్ చేసినా ఇంకా మొదలు పెట్టకుండా ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టాడు. ఈరోజు కూడా సినిమా ఓపెనింగ్ కార్యక్రమం అయ్యాకనే మీడియాకి కబురు అందింది. అలా తన అభిమానులని టెన్షన్ నుండి ఫ్రీ చేశాడు బన్నీ.

More Related Stories