English   

చిత్రలహరి ఫస్ట్ డే కలెక్షన్స్ !

Chitralahari
2019-04-13 18:30:50

మెగా మేనల్లుడు సాయి తేజ్ అదే నండీ సాయి ధరమ్ తేజ్, దర్శకుడు కిశోర్ తిరుమలల కాంబినేషన్‌ లో వచ్చిన సినిమా చిత్రలహరి. సాయి తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించిన ఈ సినిమా నిన్న రిలీజ్ ఆయనది. ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాన్సెప్ట్ పాతదే అయినా దర్శకుడి ప్రతిభ, ధరమ్‌తేజ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు బాగానే రాబట్టింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా   తెలుగు రాష్ట్రాల్లో రూ.3.08కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. నైజాంలో తొలిరోజు 83 లక్షల షేర్, ఉత్తరాంధ్రలో 43 లక్షలు, సీడెడ్ లో 52 లక్షలు రాబట్టింది. గుంటూరులో 32 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 39 లక్షలు, వెస్ట్ లో 25 లక్షలు రాబట్టడం విశేషం. నెల్లూరులో 15 లక్షలు, కృష్ణ జిల్లాలో 24 లక్షలుగా చిత్రలహరి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఇక తొలి రోజు ఈ చిత్రం యూఎస్ లో 44 లక్షల షేర్ రాబట్టింది. కర్ణాటకలో 33 లక్షలు రాబట్టిందని అంటున్నారు. వరుసగా ఆరు ప్లాపుల తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా హిట్ కావడంలో అయన అభిమానులు ఆనందోత్సాహాలతో మునిగితేలుతున్నారు.

More Related Stories