English   

నాని కోసం వెంకటేష్

jersey
2019-04-13 19:07:30

వ‌రుస సినిమాలతో బిజీగా ఉండి చేసిన ప్రతి సినిమా విజయం సాధిస్తు పోతున్నాడు నేచురల్ స్టార్ నాని. నాని తాజా చిత్రంగా 'జెర్సీ' రూపొందింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. రంజీ క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడమే కాకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.  ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనుంది. ఆ రోజు రాత్రి 7గంటల 30 నిమిషాలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా వెంకటేశ్ రానున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ కొద్ది సేపటి క్రితమే స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు

More Related Stories