English   

సూర్య సినిమాకి పేరు పెట్టారు !

suriya
2019-04-13 19:23:51

తమిళ్ స్టార్ హీరో సూర్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళుతున్నాడు. సెట్స్ పై వున్న సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకోగానే మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. అలా ఆయన ఏమాత్రం గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఈ మధ్య 'గురు' ఫేమ్ సుధా కొంగరకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా ఈ సినిమాకి 'సూరారై పొట్రు' అనే టైటిల్ ఖరారు చేసిన సినిమా యూనిట్ టైటిల్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా అపర్ణ బాలమురళిని సెలెక్ట్ చేశారని అంటున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇక  సూర్య హీరోగా కెవి ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాప్పాన్ సినిమా టీజర్‌ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు ఆ చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది.

More Related Stories