English   

రేపు సూర్య-మోహన్ లాల్ ల కాప్పన్ టీజర్ !

suriyamohanlal
2019-04-13 20:21:46

ప్ర‌స్తుతం అన్ని భాష‌ల‌లో సినిమాల్లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో త‌మిళంలో కాప్పాన్ అనే సినిమా రిలీజ్ అవనుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. రంగం ఫేం కేవీ ఆనంద్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో సూర్య‌, ఆర్య‌, మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్ర పోషిస్తుండ‌గా, సూర్య ఆయ‌న‌కి ర‌క్ష‌కుడి ఉండే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్లకి హెడ్ గా నటించనున్నాడట. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నార‌ట. దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాని ఆరోజున విడుదల చేయడమే కరెక్ట్ అని భావిస్తున్నారట. అయితే ఈ సినిమా టీజ‌ర్‌ ని మాత్రం ఏప్రిల్ 14 అంటే రేపు సాయంత్రం 7గం.ల‌కి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. కాగా, సూర్య న‌టిస్తున్న మరో సినిమా ఎన్‌జీకే మే 31న విడుద‌ల కానుంది.

 

More Related Stories