English   

జబర్దస్త్ ని జయసుధ రిజెక్ట్ చేసిందా ?

Jayasudha rejects Jabardast offer
2019-04-13 20:46:29

ఈ టీవీలో ప్రసారమవుతోన్న 'జబర్దస్త్' కామెడీ షో అత్యధిక టీఆర్పీలతో దూసుకుపోతుంది. అయితే దీనికి జడ్జేస్ గా ఉన్న నాగబాబు రోజా తమ పార్టీలకి సంబంధించిన ప్రచారాల్లో నిమగ్నమయ్యారు, ఎన్నికలు పూర్తయ్యాక కూడా రాజకీయాలకే పరిమితం అవ్వాలని బావిస్తున్నారట. అందుకే ఈ కామెడీ షో నిర్వాహకులయిన మల్లె మాల వారు క్రేజ్ వున్న సీనియర్ నతీమణులను న్యాయనిర్ణేతలుగా తీసుకునేందుకు సంప్రదింపులు జరిపారట. ఆ క్రమంలోనే జయసుధను కూడా సంప్రదించారనీ, అయితే ఆమె సున్నితంగా తిరస్కరించారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఒక  కథనాన్ని ప్రచురించింది. కుటుంబ కథా చిత్రాల నాయికగా సహజనటిగా, అమ్మ పాత్రలకు కేరాఫ్ గా జయసుధకు మంచి పేరు వుంది. రీ ఎంట్రీ నుండి ఆమె తన వయసుకి తగిన అమ్మ, అమ్మమ్మ పాత్రలతో బిజీగా ఉన్నారు. ఆమెకు ఈ బూతు షో సెట్ కాదని ఆమె భావించి ఆమె సున్నితంగా తిరస్కరించారని ఆ కధనంలో పేర్కొంది. జయసుధ తిరస్కరించిన తరువాతనే నటి మీనాని ఎంపిక చేసుకున్నారని పేర్కొన్నారు.

More Related Stories