English   

బన్నీ సినిమా మీద ముగ్గురు హీరోల భవితవ్యం !

Two young heroes key roles in Allu Arjun Trivikram film
2019-04-14 11:05:27

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముచ్చటగా మూడో సినిమా మొదలు పెట్టారు. గతంలో రెండు సూపర్ హిట్స్ ఇవ్వడంతో ఇద్దరు కాంబినేషన్ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. నిన్ననే మొదలు పెట్టిన మూడో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఇద్దరు హీరోలను తీసుకున్నట్టు చెబుతున్నారు.  త్రివిక్రమ్ సినిమా అంటే ప్రతి పాత్ర ఎలివేషన్ బాగుంటుంది, ఆ విషయం ఆయన గత సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది. ఇప్పుడు నాగార్జున మేనల్లుడు సుశాంత్ ని బన్నీ ఫ్రెండ్ నవదీప్ ని ఈ సినిమాలో కీలక పాత్రలలో ఓకే చేశారట. హీరోగా ఎన్ని విక్రమార్క ప్రయత్నాలు చేసినా సుశాంత్ కి హిట్ పడలేదు. ఇక నవదీప్ కి కెరియర్ ఆరంభంలో ఒకటి అరా సక్సెస్ లు వచ్చినా, ఆ తర్వాత ఆయన లైం లైట్ లోనే లేకుండా పోయాడు. ఈనెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా రిజల్ట్ మీద ముగ్గురు హీరోల భవితవ్యం ఆధార పడి ఉందన్నమాట.  

More Related Stories