English   

కనిపిస్తే చెంప పగలకొడుతుందట !

chinamayi
2019-04-14 12:41:25

ఆ మధ్య మీటూ ఉద్యమం మంచి పీక్స్ లో ఉన్న సమయంలో గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తమిళ గేయ రచయిత వైరముత్తుపై చేసిన లైంగిక సంబంధిత ఆరోపణలు ఎంతటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫలితంగా చిన్మయి అక్కడ సినిమా వాళ్ళకి చేదుగా అనిపించి చాలా ఆఫర్స్ ఇవ్వకుండా పక్కన పెట్టారు.  తాజాగా ఈ విషయమై గురించి ప్రస్తావించిన నెటిజన్ కి చిన్మయి సమాధానమిస్తూ 'ఈసారి వైరముత్తు కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా' అని పేర్కొని సంచలనం రేపింది. అసలు ఇప్పుడు ఈ విషయం ప్రస్తావనకు ఎందుకు వచ్చిందంటే   ఈ మధ్యే ఎన్నికల ప్రచారంలో ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్న సీనియర్ నటి ఖుష్బూని ఆ గుంపులో ఉన్న ఓ వ్యక్తి అసభ్యంగా తాకాడు. దాంతో వెంటనే ఆమె చెంప పగలగొట్టింది. ఆ వీడియో వైరల్ అయిపోయింది కూడా దాన్ని ట్యాగ్ చేస్తూ మహిళలతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఖుష్బూ సరిగ్గా బుద్ధి చెప్పిందని తెలిపాడు వైరముత్తు. దీన్ని చూసిన చిన్మయి పై విధంగా స్పందించింది. పదేళ్ల క్రితం తనను కూడా వేధించిన వైరముత్తు ఇప్పుడు కనిపిస్తే చెంప పగలగొట్టాలనుకుంటున్నట్లు పేర్కొంది చిన్మయి.  

More Related Stories