English   

అమ్మా చాలా థాంక్స్...కన్నీళ్లు పెట్టిస్తున్న సంగీత లేఖ !

Sangeetha Emotional Post on her Mother
2019-04-14 18:50:45

ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిలయింది సంగీత. అయితే ఆమె తన తల్లిని ఇంటి నుండి వెళ్ళకోట్టినట్టు వార్తలు రావడంతో  ఆమె మీద ప్ర‌తి ఒక్క‌రు మండి ప‌డుతున్నారు. దీంతో ఆమె త‌న త‌ల్లిని ఉద్దేశిస్తూ పెట్టిన ఒక పోస్ట్ సంచలనం రేపుతోంది, ఆమె పెట్టిన పోస్ట్ యధాతధంగా ప్రియ‌మైన అమ్మా, ఈ ప్రంప‌చంలోకి న‌న్ను తీసుకొచ్చినందుకు నీకు ధ‌న్య‌వాదాలు. 13 ఏళ్ళ వ‌య‌స్సులో నన్ను స్కూలుకి దూరం చేసి, ప‌ని చేయించినందుకు ధన్యవాదాలు. ఖాళీ చెక్కుల‌పై నాతో సంత‌కాలు చేయించినందుకు కృత‌జ్ఞ‌త‌లు. మందు, డ్ర‌గ్స్‌కి బానిసై జీవితంలో ఒక్క రోజు కూడా ప‌నికి వెళ్ళ‌ని నీ కొడుకుల కోసం నన్ను దోపిడి చేసినందుకు ధ‌న్య‌వాదాలు. నా ఇంట్లోనే నన్ను ఒక మూలాన పడేలా చేసినందుకు ధన్యవాదాలు. నేను పోరాడే వ‌ర‌కు నాకు పెళ్లి చేయ‌నందుకు ధ‌న్య‌వాదాలు. న‌న్ను, నా భ‌ర్త‌ని వేధిస్తూ మా ప్ర‌శాంత‌త‌ని దూరం చేసినందుకు థ్యాంక్స్. ఓ త‌ల్లి ఇలా ఉండ‌కూడ‌ద‌ని తెలియ‌జేసినందుకు ధ‌న్య‌వాదాలు. చివ‌రిగా నువ్వు చేసిన త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌కి థ్యాంక్స్. నువ్వు తెలిసో తెలియ‌క‌నో నోరు లేని అమ్మాయిని పోరాడే మ‌హిళగా మార్చావు. ఈ విష‌యంలో నిన్ను ప్రేమిస్తుంటాను. ఏదో ఒక రోజు నువ్వు నీ ఈగోని ప‌క్క‌న పెట్టి న‌న్ను చూసి క‌చ్చితంగా గ‌ర్విస్తావు అంటూ సంగీత త‌న పోస్ట్‌లో రాసింది. 

More Related Stories