English   

బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా ?

Allu Arjun
2019-04-14 18:55:59

ఇప్పటి వరకూ ఎప్పుడూ ద్విపాత్రయభినయం చేయని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  తొలిసారిగా డ్యూయల్‌ రోల్‌కు ఓకె చెప్పాడని అంటున్నారు. నా పేరు సూర్య సినిమా తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పుడు ఏక ధాటిన మూడు సినిమాలు ప్రకటించాడు. అందులో ఒక సినిమా మొన్న ప్రారంభం కూడా అయ్యింది. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఆ సినిమాలో ఆయన మామూలుగానే నటించనున్నాడు. కానీ ఓ మై ఫ్రెండ్, ఎంసిఎ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీ రామ్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలోనే ఆయన డ్యూయల్ రోల్ చేయనున్నాడు అని అంటున్నారు. చాలా భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ డ్యూయల్‌ రోల్‌ లో సంది చేయనున్నాడని, కధా పరంగా అది చాలా అవసరం అని అంటున్నారు. అలాగే మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో బన్నె పోషించే రెండు పాత్రలు ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ తో బన్నీ సినిమా చేస్తుండగా ఆ తర్వాత లైన్ లో సుకుమార్ సినిమా ఉంది. అది కూడా పూర్తయ్యాక ఈ  ఐకాన్‌ పట్టాలెక్కనుంది.

More Related Stories