English   

మరో ఐటెం నంబర్ లో మెరిసిన మహేష్ హీరోయిన్ !

Kalank song Aira Gaira Varun Dhawan, Aditya Roy Kapur woo a seductive Kriti Sanon
2019-04-14 19:04:39

మహేశ్‌ బాబు ‘1  నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కృతి సనన్‌, ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తెలుగు మళ్ళీ లక్ పరీక్షించుకోలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘స్త్రీ’ సినిమాలోని ప్రత్యేక సాంగ్ అదేనండీ ఐటెం నంబర్ లో మెరిసిన ఆమె ఇప్పుడు ‘కళంక్‌’ సినిమాలో కూడా అలాంటి పాటలో కనిపించి సందడి చేశారు. ఆ సినిమా హీరోలు వరుణ్‌ ధావన్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌లతో కలిసి ఆమె స్టెప్పులేశారు. ఈ పాట వీడియోను చిత్ర బృందం నిన్న రాత్రి పోద్దుపోయాక్ విడుదల చేసింది. ‘ఐరా గైరా’ అని సాగే ఈ పాట కుర్రాల్లకి ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీతమ్‌ సంగీతం అందించిన ఈ పాటకు అమితాబ్‌ భట్టాచార్య  సాహిత్యం సమకూర్చారు. ఈ పాట విడుదలైన 15 గంటల్లోనే దాదాపు 40 లక్షల వ్యూస్‌ సంపాదించుకుంది. ఇక ఏప్రిల్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

More Related Stories