English   

కీర్తి ఆశలు వమ్ము చేసిన రజనీ కాంత్ !

rajini
2019-04-14 19:36:05

మహానటి కీర్తి సురేష్ గురించి ఈమధ్య కాలంలో ఒక న్యూస్ వైరల్ అయింది. ఆమె రజనీ కాంత్ సరసన హీరోయిన్ గా ఎంపికయ్యింది అంటూ ఓక న్యూస్ హల్చల్ చేసింది. అయితే ఇప్పుడు ఆ న్యూస్ అంతా గాసిప్ అని అంటున్నారు. అంతే కాక అది నిజం కాకుండా గాసిప్ గానే మిగిలిపోడానికి కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ అని అంటున్నారు. రెండ్రోజుల క్రితం రజనీ - మురగదాస్ ల కాంబినేషన్ లో దర్బార్ సినిమా మొదలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందు కీర్తిని హీరోయిన్ గా అనుకున్నారట, కానీ రజనీకాంత్‌ హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేయమని చెప్పడంతో దర్శకుడు మురుగదాస్‌కు మరో దారి లేక ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. కీర్తీ తనకు జంటగా సెట్‌ అవ్వదని రజనీకాంత్‌ చెప్పారని అందుకే ఆమెని ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించారని అంటున్నారు. అలా ఆయన కీర్తీ సురేశ్‌ ఆశలను అడియాశ చేసారన్నమాట.

More Related Stories