English   

పాట కోసం అంత ఖర్చా ?

kanchana
2019-04-14 19:53:48

ముని సిరీస్ లో నాలుగో పార్ట్ గా కాంచన 3 సినిమా తెరకెక్కుతుంది. రాఘవ లారెన్స్ స్వయంగా నటించి దర్శకత్వం వచించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది సినిమా యూనిట్. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని బయట పెట్టారు సినిమా నిర్మాతలు. అదేంటంటే ఈ సినిమాలో ఒక్క సాంగ్ కోసం 1.3కోట్లు ఖర్చు చేశారట, ఈ సాంగ్ షూటింగ్ ను కేవలం 6 రోజుల్లో పూర్తి చేయగా ఈ సాంగ్ కోసం 1400 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారట. ఇక ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుందట.అలాగే తెలుగు, త‌మిళంలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన కాంచ‌న 3 చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు. క‌బీర్ దుహ‌న్ ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించనున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి, మరి ఆ రేంజ్ లో ఆడుతుందో లేదో చూడాలి.

More Related Stories