English   

రజనీతో నయన్ బాయ్ ఫ్రెండ్ సినిమా ?

nayan
2019-04-14 20:23:05

ఒకప్పుడు సోషల్ మీడియా లేని రోజుల్లో ఒక సినిమా ఓకే అయిందని నిర్మాత డైరెక్టర్, హీరోలు కలిసి ఒక ప్రెస్ మీట్ కలిసి చెప్పేవారు. సినిమా జర్నలిస్టులకి కూడా పూర్తి సమాచారం ఉంటేనే గాసిప్స్ లాంటివి కూడా రాసే వారు. కానీ కాల క్రమేనా సోషల్ మీడియా ఎంట్రీతో మొత్తం మారిపోయింది. ఏ హీరో డైరెక్టర్ తో కనపడినా స్టోరీ సిట్టింగ్ అని ఒక వార్త రాసేయడం షరా మామూలు అయింది. అలా పుట్టిన ఒక వార్త గురించే మీరు ఇప్పుడు చదవబోతున్నారు. అదేంటంటే తమిళ సూప‌ర్ స్టార్  ర‌జ‌నీకాంత్‌, నటి న‌య‌నతార బాయ్ ఫ్రెండ్ ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో  వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రానుందని వార్తలు మొదలయ్యాయి. నిజానికి అస‌లు విష‌యం ఏంటేంటే ‘చంద్రముఖి, ‘కుశలన్‌ సినిమాల తరువాత ర‌జ‌నీకాంత్‌ తో క‌లిసి న‌య‌నతార ద‌ర్భార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూట్ లో పాల్గొనేందుకు న‌య‌న‌తార త‌న బాయ్ ఫ్రెండ్ తో క‌లిసి ముంబై వెళ్లింది. ఈ సంద‌ర్భంలోనే విఘ్నేష్ శివ‌న్, ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి ఓ ఫోటో దిగారు. ఈ పిక్ సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

More Related Stories