English   

సుకుమార్ భార్య కొత్త వ్యాపారం...సమంతా హెల్ప్ !

samantha
2019-04-14 21:42:00

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తరం వారిలో ఆర్థిక స్పృహ ఎక్కువగానే కనిపిస్తోంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన ఫేం ఉన్నప్పుడే వ్యాపారాల్లో భాగస్వాములుగా చేరడమో, తామే స్వంతగా వ్యాపరం ప్రారంభించడమో చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు రియల్ ఎస్తేస్ బిజినెస్ లు చేస్తుండగా మరికొందరు హోటల్స్ నడుపుతున్నారు. తాజాగా అదే కోవలో దర్శకుడు సుకుమార్ భార్య తబిత గతేడాది లాండ్రీ వ్యాపారం ప్రారంభించారు. అలేఖ్య, గిరిజ, శరత్ అనే తన చిన్ననాటి స్నేహితులతో కలిసి లాండ్రీకార్ట్ అనే పేరుతో లాండ్రీ సంస్థను స్థాపించారు. తాజాగా దీనికి సంబంధించిన యాప్ ను ప్రముఖ హీరోయిన్ సమంత ఈరోజు లాంచ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన సమంత యాప్ ఆవిష్కరణ చేశారు. ప్రధానంగా మిడిల్ క్లాస్ ను లక్ష్యంగా చేసుకుని లాండ్రీకార్ట్ ప్రారంభించినట్టు తబిత చెబుతున్నారు. ఇందులో ప్రీమియం లాండ్రీ, డ్రైక్లీనింగ్ పేరిట రెండు రకాల సేవలు ఉన్నాయి. 

More Related Stories