English   

బంగార్రాజులో అఖిల్...క్లారిటీ ఇచ్చిన చైతూ !

Naga Chaitanya
2019-04-15 11:34:01

నాగార్జున కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయం మీద నాగార్జునే క్లారిటీ కూడా ఇచ్చారు. కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని అది పూర్తయ్యాక సెట్స్ మీదకి వెళుతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తాడని నాగార్జున మనవడిగా అయన ఈ సినిమాలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం ఎవరూ అధికారికంగా ప్రకతనించలేదు కానీ  చైతు పాత్రలో ఆయన నటించడం లేదని ఆ పాత్రను తమ్ముడు అఖిల్ నటిస్తాడని రీసెంట్ గా ఫిలిం నగర్ లో  టాక్ వినిపించింది.  తాజాగా ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూ లో చైతు స్పందిస్తూ..”బంగార్రాజులో నాన్నగారితో పాటు నేను నటిస్తున్నాను” అంటూ క్లారిటీ ఇచ్చాడు.   ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని త్వరలో హీరోయిన్స్ ను ఫైనలైజ్ చేసి వాళ్ళ పేర్లు కూడా ప్రకటిస్తామని తెలిపాడు. సో బంగార్రాజులో అఖిల్ నటిస్తాడనే వార్తలు ఒత్తి పుకార్లే అన్న మాట.

More Related Stories