English   

తేజూకి మేనమామ సపోర్ట్ !

 Chiranjeevi
2019-04-15 12:09:35

హీరో సాయి తేజ్ ఎట్టకేలకు సక్సెస్‌ను అందుకున్నారు. ఆరు సినిమాలు వరుస ఫ్లాప్స్ అందుకున్న ఆయన తాజాగా వచ్చిన  చిత్రలహరి విజయంతో ఆనందంగా ఉన్నాడు. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తరవాత తర్వాత సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో ఈ సినిమా చూసిన చిరంజీవి సినిమా మీద ప్రశంసలు కురిపించారు. ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కిషోర్ తిరుమ‌ల `చిత్ర‌ల‌హ‌రి` చిత్రాన్ని సెటిల్డ్ మెసేజ్‌తో చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడని ఆయన ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభను నిరూపించుకున్నాడని చెప్పుకొచ్చాడు. తేజు కూడా న‌టుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాడని  మెచ్యూర్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో చాలా చ‌క్క‌గా న‌టించాడని అన్నారు. ఇక పోసాని కృష్ణ‌ముర‌ళి, సునీల్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించి నిండుద‌నం తెచ్చారని, దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడని చిరంజీవి అన్నారు.  సక్సెస్‌ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మైత్రి మూవీ మేకర్స్ అని.. వారి ప్రతిష్ఠ మరింత పెరిగేలా ఈ సినిమాను రూపొందించారని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో బంధాలు బాంధవ్యాల గురించి, మరీ ముఖ్యంగా తండ్రీ కొడుకుల అనుబంధం గురించి చాలా చక్కగా చెప్పారని ఆయన అన్నారు

More Related Stories