English   

ఆర్ఆర్ఆర్ లో ప్రభాస్...నిజమేనా ?

Prabhas
2019-04-15 12:51:01

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో మీడియానే తనకు అవసరం అయినట్టు కధనాలు వండి వార్చడం మొదలు పెట్టింది. దీంతో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. అయినా ఈ ఊహాగానాల పరంపర మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో పుకారు హల్చల్ చేస్తోంది. అదేంటంటే  ఆర్ఆర్ఆర్‌లో బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ న‌టించ‌బోతున్నాడ‌నే వార్త. ఇప్పటికే అల్లూరి సీతారామ‌రాజు, కొమరం భీమ్ పాత్రలు ప్ర‌భాస్ వాయిస్‌ ఓవర్ తో ప్రారంభం అవుతాయ‌ని ఓ ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, మ‌రో వైపు ప్ర‌భాస్ చిత్రంలో కీల‌క పాత్ర చేయ‌నున్నాడ‌ని కూడా ప్రచార మొదలయ్యింది. ఒకే తెర‌పై ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌నిపిస్తే ఆ కిక్కు వేరే ఉంటుంది, కలెక్షన్లు కట్ట్టలు తెన్చుకుంటాయి. అయితే ప్రభాస్ ని సినిమాలో భాగం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఆయన పాత్రను ఎక్కడా తగ్గించకుండా క్రియేట్ చేయాలి. ఇటీవ‌ల చ‌ర‌ణ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న చిత్రీక‌ర‌ణకి కాస్త బ్రేక్ ప‌డింది. ప్రచారం జ‌రుగుతోన్న  ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

More Related Stories