English   

మరో సారి సందడి చేయనున్న చై-శామ్ !

Naga Chaitanya
2019-04-15 16:16:11

అక్కినేని నాగచైతన్య సమంత జంటగా నటించిన తాజా సినిమా మ‌జిలీ. నిజ జీవితంలో భార్యాభర్తలు అయిన వీరు సినిమాలో భార్యాభర్తలుగా జీవించారు, అందుకే ఈ సినిమాకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల క్లబ్‌ లో చేరింది. ఇంకా రానున్న రోజులలో మ‌రిన్ని వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి వస్తున్న స్పందనను బట్టి చెబుతున్నారు. అయితే  అందుతున్న తాజా స‌మాచారం ప్ర‌కారం నాగ‌చైత‌న్య సమంతలు మ‌రోసారి వెండితెర‌ మీద జంటగా సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని అంటున్నారు. ఒక టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీరిద్ద‌రికి సంబంధించి ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ట్ నేరేట్ చేయగా అది వీరికి ఎంతో న‌చ్చ‌డంతో వీరి జంట మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌లిసి నటించేందుకు సిద్దమవుతున్నారని అంటున్నారు. ఈ ఎడాదిలోనే ఈసినిమా పట్టాలెక్కనుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.  

More Related Stories