English   

చరణ్ తో వంశీ...ఎవడు కాంబినేషన్ రిపీట్ ?

 Ram Charan
2019-04-15 16:29:23

బోయపాటి సినిమా డిజాస్టర్ కావడంతో చరణ్ ఇప్పుడు అన్ని ఆశలు జక్కన్నతో చేస్తున్న  ఆర్ఆర్ఆర్ మీదే ఉన్నాయి. ఎన్టీఆర్ తో మొదటి సారి కలిసి నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ కానుంది. అయితే రాంచరణ్ తదుపరి సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అదేంటంటే జక్కన్న తో సినిమా పూర్తయ్యాక చరణ్, వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. గతంలో వీరిదిద్దరూ కలిసి  ఎవడు సినిమా చేసాడు. ఈ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇటీవల ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కలిసి చరణ్ కు స్టోరీ లైన్ చెప్పాడట వంశీ. నచ్చడం తో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను కూడా ఆర్ఆర్ఆర్ తెరకెక్కించిన దానయ్యే నిర్మిస్తాడని టాక్. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.  ప్రస్తుతం వంశీ మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే9 న విడుదల కానుంది.

More Related Stories