English   

బన్నీ సినిమా పేరు అదేనా ?

Allu Arjun
2019-04-15 17:36:17

తన చివరి సినిమా నా పేరు సూర్య తర్వాత సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చిన బన్నీ ఇటీవలే తన సినిమా త్రివిక్రమ్ తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లోని ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ నెల 24 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లేందుకు కూడా సన్నాహాలు జరుపుకుంటోంది. అయితే త్రివిక్రమ్ గత సినిమాలలో లాగానే ఈ సినిమా కూడా  తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుందనీ అందువలన 'నాన్న- నేను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని తండ్రీ కొడుకుల అనుబంధం జోనర్ నుండి తల్లీ కొడుకుల జోనర్ లోకి సినిమా కథను మార్చినట్టుగా సమాచారం. ఈ సినిమాలో మెయిన్ టర్నింగ్ పాయింట్ తల్లితోనే ఉండనున్న నేపధ్యంలో ఈ సినిమాలో తల్లి పాత్రకు టబును తీసుకున్నారని తల్లి పాత్రని ఎలివేట్ చేయాలి అంటే దానికి తగ్గట్టుగానే టైటిల్ కూడా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాకి అలకనంద అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇప్పటికే బన్నీ కూడా దీనికి ఓకే చెప్పడం జరిగిందనీ, అయన ఓకే అంటే ఫైనల్ చేసేయడమే అని అంటున్నారు.

More Related Stories