English   

ఏబీసీడీ ట్రైలర్ టాక్ !

abcd
2019-04-15 20:56:24

అల్లు శిరీష్ హీరోగా నటించిన సినిమా ‘ఏబీసీడీ’, అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. సంజీవ్ రెడ్డి అనే కొత్త దర్శకుడి దర్శకతవంలో  మధుర ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌ పై విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఒకప్పటి బాల నటుడు భరత్ ఇప్పుడు ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో నటించాడు. అలాగే అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది.  ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ ని గమనిస్తే అమెరికాలో పుట్టి పెరిగి, అక్కడ డబ్బు, అమ్మాయిలతో బాగా ఎంజాయ్ చేసే హీరో ఇండియాకి రావాల్సి వస్తుంది. సినిమాలో అల్లు శిరీష్ రిచ్ కిడ్‌గా కనిపించాడు. ఇక్కడికొచ్చాక పడిన కష్టాలు, ప్రేమ, పాలిటిక్స్ అనేదే ఈ సినిమా. ఇప్పటి దాకా శిరీష్ కి సరయిన హిట్ పడలేదు. ఈ సినిమా అయినా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

 

More Related Stories