English   

ఎంపీగా పోటీ చేస్తున్న రేసుగుర్రం శివారెడ్డి !

BJP announces Ravi Kishan as its candidate from Gorakhpur
2019-04-15 21:25:51

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రంలో విలన్ మద్దాలి శివారెడ్డి గుర్తుండే ఉంటాడు కదా. రియల్ గా గతంలో ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన ఈయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈ భోజ్‌పురి నటుడు రేసుగుర్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరవాత అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటించారు. అయితే రాజకీయాల మీద ఆసక్తితో కాంగ్రెస్‌లో చేరిన రవి కిషన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో జౌన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రవి కిషన్ ఘోర పరాజయం పొందారు. అయితే, 2017లో కాంగ్రెస్‌ను వీడిన రవి శంకర్ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు ఎంపీ సీటు ఇచ్చింది. గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి రవి కిషన్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన పేరును ఈరోజు బీజేపీ ప్రకటించింది. వాస్తవానికి రవి కిషన్ పోటీచేస్తోన్న గోరఖ్‌పూర్ నియోజకవర్గం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట. గతంలో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరి రవి కిషన్ ఏమి చేయనున్నారో మరి ?

More Related Stories