English   

శ్రద్దాని వదలలేకపోతున్న జక్కన్న !

Shraddha Kapoor to be part of SS Rajamouli RRR
2019-04-16 07:23:30

ఏ నిముషాన జక్కన్న ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టారో కానీ ఆ సినిమా రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీంతో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మారీ దాదాపు అన్ని విషయాల మీదా క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినది అన్న చందాన ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ కొని కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో ఇప్పుడు మళ్ళీ ఆ పాత్రకు తగ్గ హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డాడు జక్కన్న. నిజానికి సాహో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌. ఈ సినిమా తరువాత తెలుగులో ఆమెను ఆర్ఆర్ఆర్ లో నటించమని ఇప్పటికే సంప్రదించారట. ఆమెకు కుదరని పక్షంలో పరిణితీ చోప్రాను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి నిత్య మీనన్ కి జక్కన్న నుండి కాల్ వచ్చిందని ఆమెతో స్క్రీన్ టేస్ట్ కూడా చేశారని రెండ్రోజుల క్రితం వార్తలు హల్చల్ చేశాయి. అయితే పాత్రపరంగా శ్రద్ధా కపూర్ అయితేనే సెట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడట. అయితే ఆమె పలు సినిమాల్లో బిజీగా ఉండడంతో ఆమె నటిస్తుందా అనేది అనుమానమే. అయితే ఎలా అయినా సరే డేట్స్ సర్దుబాటు చేయించి ఈ సినిమాకి ఆమెనే తీసుకోవాలనే రాజమౌళి ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. ఏమవుతుందో చూడాలి మరి.

More Related Stories