English   

వామ్మో చరణ్ భార్య మీద శ్రీ రెడ్డికి లవ్వేంటో ?

srireddy
2019-04-16 07:36:11

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఒకప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఆదుకుంది. పవన్ కళ్యాణ్ మొదలు అల్లు శిరీష్ లాంటి హీరో దాకా అందరినీ భయపెట్టింది. ఏకంగా పవన్ ని తిట్ట్టకూడని తిట్టు తిట్టేసి పవన్ అభిమానులకు, నాగబాబుని తిట్టి పోసి మెగా అభిమానులకి శ్రీరెడ్డి బద్ధ శత్రువుగా మారిపోయింది. అయితే, తనకు చిరంజీవి కుటుంబంలో ఒక వ్యక్తి అంటే ఎంతో ఇష్టమని శ్రీరెడ్డి తాజాగా షాక్ ఇచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల.  ఉపాసనను తనకు ఎంతో దగ్గరైన వ్యక్తిగా భావిస్తానని, గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తింది శ్రీ రెడ్డి. ఉపాసన గొప్ప వ్యక్తి అని స్వీట్, వినయ విధేయత కలిగిన వ్యక్తి అని కష్టపడే తత్వం, ఎంతో సరదాగా ఉంటుంది, ఫ్యామిలీ లేడీ, సక్సెస్‌ఫుల్ లేడీ అని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. అసలు ఉపాసన ప్రస్తావన ఇప్పుడెందుకు తీసుకు వచ్చిందో తెలియట్లేదు కానీ. దీని వెనక శ్రీరెడ్డి టార్గెట్ ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

More Related Stories