English   

ఓర్నీ....ఆ రీజన్ తో రెండు కోట్లు వదులుకుందా ?

saipallavi
2019-04-16 07:59:23

ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన నేచురల్ బ్యూటీలలో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో మళయాళ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేసుకున్న ఈ భామ తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకులని ఫిదా చేసింది. అయితే తాజాగా ఆమె చేసిన పని తీవ్ర చర్చనీయాంశం అయింది. నిజానికి డబ్బు ఎవరికీ చేదు ? అది కూడా లక్షో రెండు లక్షలో కాదు ఏకంగా రెండు కోట్లు. రెండు కోట్ల రూపాయలు ఇస్తానంటే వద్దనేసింది సాయి పల్లవి. వివరాల్లోకి వెళితే ఆమె తమ కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండమంటూ రెండు కోట్ల డీల్‌తో సాయి పల్లవిని సంప్రదించారట ఒక ఫేస్ క్రీం కంపెనీ వారు. తమ కంపెనీకి చెందిన ఫేస్‌ క్రీమ్‌ యాడ్‌లో నటించాల్సిందిగా ఆమెను కోరారని సమాచారం. అయితే పల్లవి మాత్రం ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాను సినిమాల్లోనే మేకప్‌ వేసుకోనని, అలాంటిది జనాలకు ఫేస్‌ క్రీమ్‌ వాడమని ఎలా చెబుతానంటూ రెండు కోట్ల డీల్‌ తృణప్రాయంగా వదులుకున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సాయి పల్లవి చేసిన ఎన్జీకే విడుదలకి సిద్దంగా ఉంది, ఇక ఆమె తెలుగులో రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం సినిమా చేతోంది.

More Related Stories