English   

హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్...ఈసారయినా అవుతాడా ?

pradeep
2019-04-16 08:53:03

తెలుగు బుల్లితెర మీద తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. చిల్లర మాటలు లేకుండా హుందాగా ఉంటూ, తనదైన శైలిలో ఆకట్టుకునే యాంకర్ గా అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ యాంకర్ అతడు. అయితే తాజాగా ప్రదీప్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. బుల్లితెర మీద సత్తా చాటిన ప్రదీప్ వెండితెరపై కూడా మెరవబోతున్నాడట. ఇప్పటికే అతడు కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా మాత్రం చేయలేదు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా ప్రదీప్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.  సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే అసిస్టెంట్ ఈ మూవీ ద్వారా డైరక్టర్‌గా పరిచయం అవ్వబోతున్నారట. 1947 నాటి పీరియాడిక్ కథతో తెరకెక్కతోన్న ఈ సినిమాకి అనూప్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో అవగొట్టాలని భావించినా అది ఇప్పుడు నాలుగు కోట్ల దాకా వెళ్లిందట. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. నిజానికి రెండేళ్ళ క్రితమే ప్రదీప్ హీరోగా ఒక సినిమా మొదలయిందని వార్తలు వచ్చాయి. డాన్స్ కొరియోగ్రాఫర్ పేరున్న అజయ్ సాయి మణికందన్ దర్శకత్వంలో ప్రదీప్ సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా ఏమయిందో తెలీదు కానీ ఇప్పుడు మరో వార్త పుట్టుకొచ్చింది. ఇది అయినా నిజమవుతుందని ఆశిద్దాం.

More Related Stories